రేషన్ షాపుల ద్వారా 12 రకాల నిత్యవసర వస్తువులు అందించాలనీ తాసిల్దార్ కార్యాలయాల ముందు ధర్నా
స్వేచ్ఛ న్యూస్, పెద్దపల్లి జిల్లా, రామగుండం రూరల్, ఏప్రిల్ 25:
రామగుండం మండలం అంతర్గాం మండల తాసిల్దార్ కార్యాలయాల ముందు పి ఓ డబ్ల్యు సంఘాలు ధర్నాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న పి ఓ డబ్ల్యు రాష్ట్ర నాయకురాలు కోడిపుంజుల లక్ష్మి, పి వై ఎల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల రమేష్ హాజరై మాట్లాడుతూ
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించింది. దీన్ని చూసి పేదలకు భూములూ, ఇళ్ళ స్థలాలూ, కొలువులు, ఇండ్లు, రేషన్ కార్డులూ తదితర సమస్యలు సమసిపోతాయని ప్రజలు ఆశించారు. అని వారు ఉన్నారు ఈ సర్వేలు జరిపి సంవత్సరాలుగడిచినా టి అర్ఎన్ పాలనలో ప్రజలకు జరిగింది. ఒరిగింది ఏమీ లేదు. కానీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు
పాలకులు ధరల మీద, ధరలు పెంచుతున్నారు. పక్షం రోజులకోసారి పెట్రోల్, డీజిల్,ధరలు పెరిగిన ఫలితంగా రవాణా ఛార్జీలూ, ఉప్పు, పప్పు దగ్గర నుండి ప్రతి వస్తువు ధరలూ పెరిగాయి. మూలిగే నక్కపై తాటిపండు వద్ద చందంగా మొది పాలనకు ముందు 450 రూ॥కున్న గ్యాస్ సిలిండర్ ధరను 1200 రూ॥లు వరకు పెంచి, సబ్సిడీఎత్తేసింది. మోడి ప్రభుత్వం కాకులను కొట్టి గద్దలకేసినట్లుగా పేదోళ్ల నోళ్ళు గొట్టి అతి పెద్ద కుబేరులయిన అదానీ, అంబానీలకేమో లక్షల కోట్లు దోచి పెడుతుంది ఇప్పటికీ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ప్రజలకు భద్రత కల్పించే ప్రణాళికలు లేవు. పైగా ప్రజాపంపిణీ వ్యవస్థను నీరుగార్చే వైపుగా పాలకుల విధానాలున్నాయి. కేసీఆర్ పాలనలో ఇప్పటి వరకూ అర్హులైన లక్షలాది మంది లబ్ధిదారులు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నా, వారికి కార్డులివ్వలేదు.
కేవలం 5 కేజీల బియ్యం అవి కూడా ఎఫ్.సి.ఐ. గోదాముల్లో ముక్కి, పురుగుపట్టినవి ప్రజల మొఖానపోస్తున్నారు, రుచీవరీలేని అన్నం తినలేక వాటిని కోళ్ళకూ, పశువులకు పెడుతున్నారు. ఏదో కొద్ది మంది మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వం నుండి ఏ రాయితీ పొందాలన్నా, తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కనుక కార్డు పోతుందనే భయంతో విధిలేక రేషన్ బియ్యం అక్కడికక్కడే వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. వీటిని రీసైక్లింగ్ చేసి మిల్లర్లు లాభాలు గడిస్తున్నారు. వీటినే సన్న బియ్యమిస్తున్నామని కేసీఆర్ గారు గొప్పగా చెప్పుకుంటున్నారు అని అన్నారు
రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 5 లక్షల మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా, మూడు లక్షల మందికి మాత్రమే కా ర్డులు మంజూరు చేశారు. ఒక్కో జిల్లాలో 30 వేల నుండి దాదాపు 80 వేల మందికి పైగా లబ్ధిదారులను అర్హులుగా నిర్ధారించారు. కానీ మంజూరు చేయలేదు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అర్హులైన వారికి కార్డులు మంజూరు చేయాలనీ, కేషన్ షాపుల ద్వారా 12 రకాల విద్యావసర సరుకులను పంపిణీచేయాలనీ, కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ను సగం సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకొక్కరికి కేంద్రం 5 కేజీలు, రాష్ట్రం కేజీలు సన్న బియ్యం పంపిణీ చేయాలి. రేషన్ షాపుల ద్వారా మంచినూనె, కంది పప్పు, చింతపండు, గోధుములు, పల్లీలు, ఉప్పు, కారం, పసుపు, చక్కెర, టీ పొడి ఉచితంగా అందించాలి.అర్హులైన వారందరికి రేషన్ కార్డులివ్వాలి. వంట గ్యాస్ ను సగం సబ్సిడీతో ఇవ్వాలని డిమాండ్ చేశారు
ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా జిల్లా నాయకులు జిల్లా సత్యనారాయణరెడ్డి, మార్త రాములు గొల్లపల్లి చంద్రయ్య,గుమ్మడి వెంకన్న, ఆడెపు శంకర్, నాయకురాలు మార్త రాద, కల్పన దేవన్న, ఉడుత శ్రీను, కల్పన తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!