గుడుంబా స్థావరాలు పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 12: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపెల్లి,మంచిర్యాల జోన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలలో అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి ఐపీఎస్(డిఐజి)ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి మల్లారెడ్డి,ఇన్స్పెక్టర్లు అశోక్,సుధాకర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీమ్స్ గుడుంబా స్థావరాలు,ఇండ్లలో తనిఖీ చేసి గుడుంబా,బెల్లం పానకం గుర్తించి ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. ఈ తనిఖీలలో గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేకే నగర్ 8 ఇంక్లెన్ కాలనీ లోని అంజమ్మw/oచందు ఇంటి వద్ద ఆరు లీటర్ల గుడుంబా,40 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి కేసు నమోదు చేశారు.బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి జీడీ నగర్లో శివరాత్రి శంకర్ గుడుంబా తయారీకి నిల్వచేసిన 100 లీ. బెల్లం పానకం ధ్వంసం.ధర్మారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో భానోత్ గంగారాం s/o రాజం నాయక్ గుడుంబా తయారీ కోసం దాచిన 25 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు.నెన్నేల్ పోలీస్ స్టేషన్ పరిధి గంగారం గ్రామంలోని ఉమ్మల మల్లేశ్వరిw/o కొమురయ్య ఇంటి వద్ద 44 ప్యాకెట్ల గుడుంబా,రత్నం పోచమల్లుs/oపోచం ఇంటి వద్ద 84 ప్యాకెట్ల గుడుంబా స్వాధీనం చేసుకుని వీరుపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి ఎవరు కూడా అక్రమంగా గుడుంబా తయారుచేసిన అమ్మిన,నాటు నాటు సారా తయారీకి ముడి సరుకులైన బెల్లము,పట్టిక రవాణా చేసిన,నిలువచేసిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన కట్టిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!