అర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగుల పంపిణీ
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 9: పాలకుర్తి మండలంలోని పాలకుర్తి పాలకుర్తి మండలంలోని పాలకుర్తి,ఈసాల తక్కల్లపల్లి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి కందుల సంధ్యారాణి పాల్గొని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ అందించిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను ఆధునికరిస్తూ నూతన విద్యా విధానాన్ని అవలంబిస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తుందని అన్నారు.ప్రైవేటు పాఠశాల లకు దీటుగా డిజిటల్ విద్యను అందిస్తూందన్నారు.ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం సహకారంతోపాటు మనం కూడా ఆర్గనైజేషన్ ద్వారా విద్యార్థులకి సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి తమ వంతు సహకారం అందజేయాలన్న అర్ష ఫౌండేషన్ సభ్యులను అభినందిస్తున్నానన్నారు. ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు అందజేస్తున్న సహకారాన్ని విద్యార్థులు వినియోగించుకొని బాగా చదివి మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానని అని అన్నారు.ఈ కార్యక్రమంలో హర్ష ఫౌండేషన్ నిర్వాహకుడు బూడిద హర్ష,ప్రధానోపాధ్యాయులు వి సత్యనారాయణ రెడ్డి,కే శ్రీనివాస్,ఉపాధ్యాయులు సత్యనారాయణమూర్తి,నరసయ్య,రవీందర్,భరత్ కుమార్,శిరోమణి,స్వరూప రాణి,నీలం రాణి తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!