తెలంగాణ లేబర్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 3: గోదావరిఖని మేదర్ బస్తీలోని ఉత్తర తెలంగాణ లేబర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కన్నం భానుచందర్ అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గొర్రె రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నారని మెడికల్ కాలేజీ సింగరేణి కార్మికుల డబ్బులతో సింగరేణి స్థలంలో నిర్మించబడినప్పటికీ సింగరేణి కార్మికుల పిల్లలకు ఐదు శాతమే సీట్లు లభిస్తున్నాయని ఇది సింగరేణి కార్మికులకు తీవ్ర ద్రోహం అని అన్నారు.గోదావరిఖనికి సబ్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకురాకుండానే తీసుకువచ్చినామని కోర్టుకు ప్రజా ప్రతినిధులకు సంబంధం లేని కోర్టు బిల్డింగ్ కట్టిస్తున్నామని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు.గోదావరిఖనిలో ఐటీ పార్క్ అంతర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చేయలేదన్నారు.మున్సిపల్ కార్పొరేషన్ నిధులు 400 కోట్లు దుర్వినియోగం చేశాడని ఆరోపించారు.ఈ విధంగా చేయని పనులను చేసినట్లు చెప్పుకుంటున్నా అబద్దాలకోరు ఎమ్మెల్యేకు ఈ నెల 30 వ తారీకున జరిగే ఎన్నికలలో బుద్ధి చెప్పి ప్రజా శ్రేయస్ కోసం పాటుపడే నాకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అల్లెపు తిరుపతి,సలిగంటి ఓదెలు,జక్కం కవిత,పొన్నం రజిత తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!