నకిలీ విత్తనాలు,నకిలీ ఎరువులు ఎవరైనా విక్రయిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 22: రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్ ఐపీఎస్ ఉత్తర్వుల ప్రకారం పెద్దపల్లి జిల్లా మంథని,ముత్తారం, కమాన్పూర్, రామగిరి మండలలో విత్తనాలు,ఎరువులు అమ్మే ఫర్టిలైజర్స్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీస్,వ్యవసాయ అధికారులు సంయుక్తంగా కలిసి ఎరువులు,విత్తనాలు అమ్మే దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. రైతులకు ఎవరైనా నకిలీ విత్తనాలు,ఎరువులు అమ్మరని తెలిసిన, అమ్మిన వారిపై చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ఎవరు నకిలీ విత్తనాలు,ఎరువులు అమ్మరాదని అమ్మిన ప్రతి విత్తనాలకు,ఎరువులకు బిల్లులు ఇవ్వాలని ఎవరైనా నకిలీ ఎరువులు,విత్తనాలు సరఫరా చేస్తే స్థానిక పోలీసులకు లేదా 100. కు డయల్ చేసి సమాచారం అందించాలని ఫర్టిలైజర్స్ షాప్స్ యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. ఇట్టి తనిఖీల్లో టాస్క్ ఫోర్స్ ఎస్ ఐ ఆది మధుసూదన్ టాస్క్ ఫోర్ సిబ్బంది ఆయా మండలాల AO వారి సిబ్బంది పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!