బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో సబండ వర్గాలకు లబ్ధి
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 4:శనివారం గోదావరిఖని తిలక్ నగర్ డౌన్ విశ్వం కమ్యూనిటీ హాల్లో 36వ డివిజన్ మహిళలు 200 వందల మంది బిఆర్ఎస్ పార్టీలో చేరిక సందర్భంగా రామగుండం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ పాల్గొని వారికి గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తున్నారని అన్నారు.మానవీయ కోణంలో సిఎం ఆలోచన చేసి పార్టీ మేనిఫెస్టోలో మహిళల సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇచ్చారన్నారు.ఈ ప్రాంత ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని మెడికల్ కళాశాల తీసుకువచ్చానని జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలలు ప్రభుత్వం మంజూరు చేసిన సందర్భంలో సీఎం కేసీఆర్ ను ఒప్పించి విప్పించి 500 కోట్లతో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యం ప్రజలకు అందేలా చేశానన్నారు.నా ఆడబిడ్డలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మహిళలందరూ ఆరు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని నా కుటుంబంలో జరిగిన విధంగా ఇంకా ఏ కుటుంబంలో జరగకూడదని అన్నారు.రామగుండం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ భవితకు భరోసగా సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాలకు లబ్ధి చేకూరేలా మేనిఫెస్టో రూపొందించారని ప్రజా ఆమోదయోగ్యమైన మేనిఫెస్టో ప్రకటించడం దేశంలో ఎక్కడా లేదన్నారు.రైతుబంధు ఎకరాకు సంవత్సరానికి 16000, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా పథకం,ఒక ఇంటికి 4000 రూపాయలు చెల్లించి ఐదు లక్షలు బీమా సౌకర్యం, తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డుపై సన్న బియ్యం పంపిణీ,ఆసరా పెన్షన్లు రూపాయలు ఐదు వేలకు పెంపు,సౌభాగ్యలక్ష్మీ అర్హులైన ప్రతి మహిళకు 3వేల రూపాయలు, అర్హులైన లబ్ధిదారులకు 400కే సిలిండర్,ఆరోగ్యశ్రీ పరిమితి 15 లక్షలకు పెంచడం జరిగిందన్నారు.ప్రజలందరూ రామగుండం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని,సీఎం కేసీఆర్ ఇవ్వబోయే పథకాలను దృష్టిలో పెట్టుకొని కారు గుర్తుకే ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మూల విజయ రెడ్డి,కార్పొరేటర్ బాలరాజ్,కుమార్ చిలకలపల్లి,శ్రీనివాస్ జేవి రాజు,ఎన్ఆర్ఐ వ్యాల్ల హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!