నిరుద్యోగుల పాలిట యమగండం టిఎస్పిఎస్సి:
ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి దాసరి విజయ్ కుమార్
స్వేచ్ఛ న్యూస్, ఏప్రిల్ 28, రామగుండం: చదువుకొని ఉండి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో అవకతవకలకు పాల్పడుతూ తెలంగాణ రాష్ట్రo నిరుద్యోగుల పాలిట యమగండం గా మారిందని కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి దాసరి విజయ్ కుమార్ శుక్రవారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలని కోరుతూ చదువుకొని ఉద్యోగం వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులను మోసం చేసిన టిఆర్ఎస్ పార్టీ కి రానున్న రోజుల్లో నిరుద్యోగులు తగిన గుణపాఠం చెప్పాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధమైన చర్యలకు పాల్పడిన టిఎస్పీ ఎస్పీ బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారికి గోదావరిఖని లోని పోస్ట్ ఆఫీస్ నుండి రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయడం కొరకు ఎన్ ఎస్ యు ఐ ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి దాసరి విజయ్ కుమార్
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!