ఉత్తమ ట్రైనర్ గా ఎంపికైన గూడూరు అంజిరెడ్డి


స్వేఛ్చ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్ట్ 12 : ఆంటీ నార్కోటిక్ బ్యూరో (ఈగల్ ఫోర్స్) సంస్థ ద్వారా ఉత్తమ ట్రైనర్ గా గూడూరు అంజిరెడ్డి ఎంపికయ్యారు. మంగళ వారం హైదరాబాద్ ఇంటిగ్రెటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన ఆంటీ నార్కోటిక్స్ ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా డ్రగ్స్ పై అవగాహన కల్పించడం లో ఉత్తమ సేవలు అందించిన వీరికీ టి జీ ఏ ఎన్ బి డైరెక్టర్ జనరల్ సందీప్ శాండిల్యా, ఎస్ పి సీతారాములు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమం లో ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు, శ్రీధర్ వీరమళ్ళ
డి ఎస్ పి లు కృష్ణ మూర్తి, సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *