క్రమశిక్షణ కలిగిన జీవనవిధానం తో మోడీ సంకల్పానికి సహకరిద్దాం:యస్ఐ

స్వేఛ్చ న్యూస్, నార్కెట్పల్లి, ఆగష్టు 14: 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ ప్రధాని మోడీ పిలుపు మేరకు గురువారం నార్కెట్పల్లి పట్టణంలో 70 మీటర్ల జాతీయ జెండాతో నిర్వహించిన తిరంగా ర్యాలీకి విశిష్ట అతిథిగా పాల్గొన్న స్థానిక ఎస్సై క్రాంతి కుమార్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో యువతది కీలక పాత్రని, అలాంటి యువత గంజాయి, మద్యం తదితర చెడు మార్గాలకు అలవాటు పడి తమ భవిష్యత్తును మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిని గుర్తించి పోలీసువారికి సమాచారం అందిస్తే గంజాయి రహిత దేశభక్తి, జాతీయ భావం, క్రమశిక్షణ కలిగిన మంచి పౌర సమాజాన్ని తీర్చిదిద్దవచ్చాన్నారు. దేశంపట్ల గౌరవభావం కలిగిన సమాజ నిర్మాణం తో భారతదేశాన్ని ప్రపంచ నెంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దాలనే మన ప్రధాని సంకల్పానికి సహాకరిద్దామని సూచించారు. విద్యార్థులు, యువకులు, స్థానిక ప్రజలతో గంజాయి నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. నల్గొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు గంజాయి సేవించిన, రవాణా చేసిన, అమ్మిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తున్నట్టు తెలిపారు. నార్కట్పల్లి పరిసర ప్రాంతాలల్లో ప్రతి నిత్యం డ్రోన్ కెమెరాతో పాటు ఇతర మార్ఘలల్లో నిఘా ఉంచినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *