చెరువుగట్టు హుండీ లెక్కింపు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 20: తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపును మంగళవారం దేవాదాయ శాక పరిశీలకురాలు సుమతి, దేవాలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ మోహన్ బాబుల సమక్షంలో నిర్వహించారు. గట్టు కింద ఆలయ హుండీ లో అమ్మవారికి భక్తులు సమర్పించిన నగదు 3,85,695/- రూపాయలు. అదేవిధంగా గట్టుపైన స్వామివారికి భక్తులు సమర్పించిన నగదు 28,98,762/- రూపాయలు గత 52 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు సమర్పించిన మొత్తం 32,84,457/- రూపాయలు వచ్చినట్లు ఈవో మోహన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో నందిగామ కు చెందిన శ్రీ దుర్గా శివ సాయి సేవా సమితి సభ్యులు, హెచ్ డి ఎఫ్ సి నల్లగొండ బ్రాంచ్ సిబ్బంది, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *