నార్కెట్‌పల్లి పట్టణంలో అసంపూర్తి రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి : బిజెపి

నార్కెట్‌పల్లి పట్టణంలో అసంపూర్తిగా చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని కోరుతు శనివారం భారతీయ జనతా పార్టీ ఆద్వర్యంలో స్ధానిక నల్గొండ చౌరస్తా వద్ద రాస్తారకో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు మేడబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికల ముందు పటణ్ణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ నేటికీ పూర్తి కాకపోవడం శోచనీయం అన్నారు. ఇప్పటికీ పలుమార్లు అధికారులను కలసి విన్నవించినా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. నల్గొండ రోడ్డు చౌరస్తా లో చిన్నపాటి వర్షానికే చెరువును తలపించే విధంగా నీళ్ళు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం జేశారు.
అనంతరం దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నకిరెకంటి మొగిలయ్య మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేషం ని జులై 3వ తేదీన కలసి రహదారి విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని కోరగ జూలై 6వ తేదీ నుంచి మొదలు పెడతామని హామీ ఇవ్వడం జరిగింది. అయినా నేటికీ రహదారి విస్తరణ పనులు చేపట్టని ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మైల నరసింహ మాట్లాడుతూ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ మండలం నుంచే ఉన్నా కూడా మండలాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. నార్కెట్పల్లి నుంచి మాండ్రకు వెళ్లే రహదారిని శంకుస్థాపన చేసి నెలలు గడుస్తున్నా శిలాఫలకమే మిగిలిందన్నారు. R&B మంత్రిగా ఉండి కూడా సొంత మండలానికి నిధులు విడుదల చేయలేని చేతకాని మంత్రి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం స్థానిక తహసిల్దార్ ని కలిసి పట్టణ ప్రజల బాధలు ఆలకించి ఉన్నతాదికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్ళి పరిష్కరించాలని విన్నవించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ నడింపల్లి శ్రవణ్ కుమార్, ఓబీసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మునుకుంట్ల గణేష్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కొరివి శంకర్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లెబోయి‌న రమేష్, SC మొర్చా రాష్ట కార్యవర్గ సభ్యుడు లింగాల వీరయ్య మండల పార్టీ ఉపాధ్యక్షుడు నోముల నాగరాజు, మండల‌ ప్రధాన కార్యదర్శులు అక్కెనపల్లి సత్తయ్య, బిళ్ళకంటి శ్రీకాంత్, యడమ పురుషోత్తం రెడ్డి, పాల్వాయి భాస్కర్ రావ్, బిక్కంటి గణేష్, మిరియాల ధనుంజయ, పున్నం వాసు, రూపని సత్యనారాయణ, ఏర్పుల పరమేష్, కొత్త మహేష్, పామనగుండ్ల శివ, పల్లెర్ల నాగరాజు, యాట చందూ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *