ప్రజలలో జాతీయ భావం పెంచడమే లక్ష్యంగా తిరంగా ర్యాలీ

స్వేఛ్చ న్యూస్, నార్కెట్పల్లి, ఆగష్టు 14: దేశంపై ప్రేమను చాటి దేశ ప్రజలలో జాతీయ భావాన్ని పెంచడమే లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి పేర్కొన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నార్కెట్పల్లి పట్టణంలో 70 మీటర్ల జాతీయ జెండాతో నిర్వహించిన తిరంగా ర్యాలీకి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ భారత పౌరుల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ పహల్గాం ఉగ్రదాడికి బాధ్యులైన ఉగ్రవాదులను ఏరివేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని చేపట్టి పాకిస్థాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను కూల్చి తన సైనిక సత్తాను చాటిన భారత సైన్యం సేవలను గుర్తిస్తూ దేశంలోని అంతర్గత ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే పౌరులకు దేశంపై ప్రేమను పెంచడమే మార్గమని గుర్తించిన ప్రధాని దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో తిరంగా ర్యాలీ నిర్వహించి పౌరులని చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఆదేశానికి చెందిన డైరీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులను మన దేశంలో అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని కోరడంతో దానివల్ల భారతదేశంలోని రైతులు, పాడి పరిశ్రమపై ఆధారపడిన కోట్లాది కుటుంబాలు రోడ్డున పడతాయనే ఉద్దేశంతో మన ప్రధాని ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరగకుండా చర్చలు కొనసాగిస్తున్నారని తెలిపారు. దేశానికి వెన్నెముకైనా రైతుల విషయంలో ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనని దేశ ప్రధాని భీష్మించుకు కూర్చున్నారని పేర్కొన్నారు. అన్ని రంగాలలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న మోడీకి మన వంతుగా నిత్యం సహాయ సహకారాలు అందించాలని కోరారు.

బిజెపి మండల అధ్యక్షుడు మేడబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మోడీ పిలుపుమేరకు నార్కెట్పల్లిలో చేపట్టిన తిరంగా యాత్రలో పాల్గొని విజయవంతం చేసిన మహాత్మ జ్యోతిబాపూలే, చైతన్య టెక్నో స్కూల్, చేతన స్కూల్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, బిజెపి నాయకులు, 70 మీటర్ల జాతీయ జెండాను సమకూర్చిన జనగణమన ఉత్సవ సమితి సభ్యులు, నార్కెట్పల్లి పట్టణ, మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బిళ్ళకంటి శ్రీకాంత్, మండల ఉపాధ్యక్షుడు నోముల నాగరాజు, మల్లేబోయిన రామలింగం, సీనియర్ నాయకులు పాల్వాయి భాస్కర్ రావు, ముంత నరసింహ, మునుకుంట్ల గణేష్, వడ్డేగోని రామలింగం, కల్లూరి కార్తీక్, మునుగోటి ప్రసాద్, నల్లగొండ నాగరాజు, పల్లెర్ల నాగరాజు, పల్లెర్ల సత్యనారాయణ, యువమోర్చా నాయకులు పాలకూరి రమేష్, పామనుగుడ్ల శివ, ఉండ్రాతి ఆంజనేయులు, లింగాల నవీన్, పుల్లెంల నవీన్, ఉండ్రాతి సాయి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *