
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్టు 19: నార్కెట్పల్లి మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ కుల సంఘం ఆధ్వర్యంలో పెద్దమంగళి ప్రజ్ఞాపురం శివకుమార్ సమక్షంలో మంగళవారం పట్టణంలోని గ్రామపంచాయతీ ఎదురుగా ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయంలో బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దమంగళి శివకుమార్ మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన అమ్మవారి దేవస్థానంలో గత మూడు సంవత్సరాలుగా వార్షిక కళ్యాణం నిర్వహిస్తున్నామని అందులో భాగంగా సోమవారం ఎల్లమ్మ అమ్మవారికి జమదగ్నిమునికి కళ్యాణం నిర్వహించి నేడు బోనాలు సమర్పించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాపురం పుల్లయ్య, ప్రజ్ఞాపురం వసంత్ కుమార్, ప్రజ్ఞాపురం రవి, అశోక్, ప్రజ్ఞాపురం జిత్తు, ప్రజ్ఞాపురం జీవన్ కిషోర్, కిరణ్, రాము, ప్రవీణ్, గడ్డం శివరాం, గడ్డం కిరణ్, మురళి, శీను, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

