
స్వేచ్చ న్యూస్, నార్కెట్పల్లి, నవంబర్ 07 : భారత స్వాతంత్ర ఉద్యమంలో వందేమాతర గేయానిధి ప్రత్యేక స్థానమని జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షుడు కన్నెబోయిన నర్సింహ పేర్కొన్నారు. బంకించంద్ర చటర్జీ వందేమాతర గేయాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నిర్వహించిన వందేమాతర గేయాలపన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలోని నల్గొండ చౌరస్తాలో జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వందేమాతర గేయాలపన కార్యక్రమాన్ని ఉద్దేశించి నరసింహ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన నాటి ఉద్యమకారులతోపాటు సామాన్య రైతు వరకు ప్రతి ఒక్కరు వందేమాతరం నినాదంతో ఐకమత్యాన్ని ప్రదర్శించి తమ స్వతంత్ర రాజ్యాధికార కాంక్షను నెరవేర్చుకున్నారని తెలిపారు. అనగదొక్కిన ప్రతిసారి వందేమాతరం నినాదంతో అంచలంచెలుగా ఉద్యమానికి ఊపిరిలూది తమలోని అగ్నిజ్జాలను రగిల్చి ఆంగ్లేయులను సప్త సముద్రాలు దాటించిన ఘనత నాటి ఉద్యమకారులదని వారి ఐక్యత, విరోచిత పోరాటం, త్యాగం వల్లనే నేడు మన పౌరులందరూ స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఆస్వాదిస్తూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్, మహాత్మా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులతో పాటు మాజీ జెడ్పిటిసి దూదిమెట్ల సత్తయ్య, పంచాయతీ కార్యదర్శి సుభాన్, బిజెపి మండల అధ్యక్షుడు మేడబోయిన శ్రీనివాస్, జనగణమన ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి నోముల నాగరాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జేరిపోతుల భరత్, వివిధ రాజకీయ పార్టీ ల నాయకులు నడింపల్లి శ్రవణ్ కుమార్, బిల్ల కంటి శ్రీకాంత్, పల్లెర్ల నాగరాజు, పాల్వాయి భాస్కర్ రావు, బండారు రమేష్, గణేష్, శ్రీను, శివ, బిక్షం తదితరులు పాల్గొన్నారు.
