
జెండావిష్కరణ చేస్తున్న ఉత్సవ సమితి అధ్యక్షులు నరసింహ
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 26: భారతదేశ పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణ, రిజర్వేషన్ తదితర అవకాశాలను సద్వినియోగం చేసుకొని బాధ్యతగల పౌరుడిగా ఎదగాలని జనగణమణ ఉత్సవ సమితి నార్కెట్పల్లి అధ్యక్షులు కన్నెబోయిన నర్సింహ పేర్కొన్నారు. ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనగణమణ సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జండావిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసినప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందన్నారు. పౌరుల హక్కులను కాల రాయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి నోముల నాగరాజు, కోశాధికారి గూడూరు అంజిరెడ్డి, నాయకులు పాల్వాయి భాస్కరరావు, మెడబోయిన శ్రీనివాస్, పల్లెర్ల నాగరాజు, బండారు రమేష్, నడింపల్లి శ్రవణ్, పాలకూరి రమేష్, బొల్లెద్దు రామలింగం, ప్రవీణ్, శివ, అశోక్, రాజేష్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
