
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జులై 28: ఈనెల 25 నుంచి 27 వరకు కరీంనగర్ జిల్లా వివేకానంద సి.బి.ఎస్సి. రెసిడెన్షియల్ స్కూల్ లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల సిబిఎస్ఇ క్లస్టర్ -7 బాలుర కబడ్డీ పోటీలలో నార్కెట్పల్లికి చెందిన శ్రీ విద్యాపీట్ పాఠశాల విద్యార్థులు అండర్ 17 విభాగంలో రన్నర్ గా నిలిచి సిల్వర్ మెడల్ సాధించారు. అదేవిధంగా అండర్ 14 విభాగంలో పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచి రజత పథకాన్ని సాధించారు. గెలుపొందిన అండర్ -17, అండర్-14 విద్యార్థులను, కోచ్ జగదీశ్వర్ రావు ను కామినేని యజమాన్యం ప్రశంసించారు. పాఠశాల ప్రిన్సిపల్ బిట్ర సుస్మిత మాట్లాడుతూ భవిష్యత్తులో క్రీడారంగంలో మరిన్ని విజయాలు సాధించి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులను, కోచ్ ను అభినందించారు.
బెస్ట్ ఢిఫెండర్ గా కన్నెబోయిన శ్రీజన్

కరీంనగర్ లో జులై 25 నుంచి 27 వరకు నిర్వహించిన ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల సిబిఎస్ఇ క్లస్టర్-7 బాలుర కబడ్డీ పోటీలలో పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థి కన్నెబోయిన శ్రీజన్ అండర్ – 17 విభాగంలో బెస్ట్ డిఫెండర్ అవార్డును కైవసం చేసుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి బెస్ట్ డిఫెండర్ అవార్డును గెలుచుకున్న శ్రీజన్ ను పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపల్, కోచ్ లు అభినందించారు.
