
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 22: నార్కట్పల్లి పట్టణ కేంద్రంలో ని గ్రామపంచాయతీ కి చెందిన కూరగాయల అంగడి స్థలంలో ఫీల్డ్ ఎంక్వయిరీ చేసి కబ్జాదారుల ఆట కట్టించాలని కోరుతూ బుధవారం నార్కెట్పల్లి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. బుధవారం ప్రజాపాలన గ్రామసభలో భాగంగా నార్కెట్పల్లి గ్రామపంచాయతీకి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ల గా గతంలో నార్కెట్పల్లి పరిరక్షణ సమితి సభ్యులు సమర్పించిన దరఖాస్తు విషయమై తహసిల్దార్ తదితర అధికారులతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు. ఇట్టి విషయంపై కొంత సమయం పడుతుందని సూచించారు. ఈ సందర్భంగా పరిరక్షణ సమితి సభ్యులు కలెక్టర్ తో మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పశువుల సంత, కూరగాయల సంత నిర్వహిస్తున్న ప్రస్తుత కూరగాయల అంగడి స్థలంలో ఏర్పడిన వివాదం విషయంలో ఫీల్డ్ ఎంక్వయిరీ (ప్రత్యక్ష పరిశీలన) చేసి నిజా నిజాలు తేల్చి ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు. అదేవిధంగా నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలోని వైఎస్సార్ కాలనీలో అన్యాత్రాంతమైన ప్రభుత్వ ప్లాట్లపై ఎంక్వయిరీ చేసి అత్యంత నిరుపేదలకు ప్లాట్లు కేటాయించి ప్రభుత్వం ప్రకటించిన పథకంలో భాగంగా ఇండ్లను నిర్మించాలని కోరారు.
