కొలువుదీరిన కొత్త సర్పంచ్ లు


మాండ్ర గ్రామములో సర్పంచ్ గా ఎన్నికైన దొండ రమేష్ ని అభినందిస్తున్న గ్రామస్తులు
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, డిసెంబర్ 22: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడత డిసెంబర్ 11 న నిర్వహించిన ఎన్నికలలో విజయం సాధించిన కొత్త సర్పంచ్ లు, వార్డు మెంబర్లు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం అపాయింటెడ్ డే అయిన డిసెంబర్ 22 సోమవారం మండలంలోని 29 గ్రామపంచాయతీలలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయా గ్రామ పంచాయతీలకు కేటాయించిన స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో నూతన పాలకవర్గాలు ప్రమాణస్వీకారం చేశాయి.


ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి: ఎమ్మెల్యే
చిన్న నారాయణపురం గ్రామం లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వీరేశం
మండలంలోని ఎల్లారెడ్డిగూడెం, ఎడవల్లి, గోపలాయపల్లి చిన్న నారాయణపురం గ్రామాలలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం హాజరై నూతన పాలక వర్గాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు అప్పగించిన బాధ్యతను ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా నీతి నిజాయితీతో పాలన చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని సూచించారు.

చిన్న నారాయణపురంలో ఉద్రిక్తత

గ్రామంలో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు
స్వేచ్ఛ న్యూస్: చిన్న నారాయణపురం పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ బందోబస్తు మధ్య ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరయ్యారు. వివరాల్లోకి వెళితే బిఆర్ఎస్ పార్టీ నాయకులు తామే గెలిచామని సర్పంచ్ ఉప సర్పంచ్ పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల రోజు ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో టాస్ వేయగా బిఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించారు. అనంతరం రీకౌంటింగ్ చేయగా ఒక ఓటు తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించిన ఆర్.ఓ ధ్రువీకరణ పత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కి అందజేశారు. ఈ విషయంపై ఆరోజు జరిగిన వివాదంలో పలువురికి గాయాలు అయిన విషయం విధితమే మళ్లీ అలాంటి సంఘటన ఏమైనా జరుగుతుందేమో అని గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పంచాయతీ అధికారులు, పోలీసులు బిఆర్ఎస్ నాయకులకు నచ్చజెప్పి ఫ్లెక్సీలను తొలగించడంతో గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రం ఎమ్మెల్యే సమక్షంలో ప్రమాణస్వీకారం కార్యక్రమం ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముగిసింది.

ఎమ్మెల్యే వీరేశం తో పాటు ఎల్లారెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ ఎల్లందుల లింగస్వామి జిల్లా నాయకులు వడ్డే భూపాల్ రెడ్డిని సన్మానిస్తున్న గ్రామస్తులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *