అన్య మతస్తులకు అందలం-వేద పండితుల అసహనం

స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 4, నార్కెట్పల్లి: తెలంగాణ లోని ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న నల్లగొండ జిల్లా, నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో అధికారుల నిర్లక్ష్యం వల్ల వేద పండితులు ఆవేదనకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే ఈ నెల 2వ తేదీ నుంచి ఎంతో అంగరంగ వైభవంగా, అట్టహాసంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలలో మైక్ సెట్ నిర్వహణను అన్యమతస్తులకు అప్పజెప్పడంతో వారు మంగళవారం బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన గణపతి పూజ, రుద్రాభిషేకములు, అఖండ స్థాపన, త్రిశూల పూజ పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలకు ఏర్పాటు చేసిన సౌండ్ సిస్టం సరిగా లేకపోవడంతో వేద పండితులు తీవ్ర అసహనానికి గురయ్యారు. పూజా కార్యక్రమంలో భాగంగా దేవాది దేవతలను ఆవాహన చేస్తు వేదమంత్రోచ్చరణ ఉచ్చరిస్తున్న సమయంలో సౌండ్ సిస్టం అనేకసార్లు అంతరాయం కలిగించడంతో వేద పండితులు నిస్సహాయ స్థితిలో తమ మంత్రోచ్చరణను కొనసాగించాల్సి వచ్చింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా సౌండ్ సిస్టం సెట్ కాకపోవడం పై వేద పండితులు నిరుత్సాహానికి గురయ్యారు. హిందూ దేవాలయాలలో ఇతర మతస్తులకు పనులు అప్పజెప్పకూడదన్న కనీస జ్ఞానం అధికారులకు లేకపోవడం విడ్డూరమని అక్కడికి వచ్చిన పలువురు భక్తులు ఆరోపించారు.
అన్యమతస్తులకు పనులు అప్పజెప్పిన అధికారులను వెంటనే శిక్షించాలి.
మెడబోయిన శ్రీనివాస్ యాదవ్: బిజెపి నాయకులు
తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్, చతిస్గడ్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలకు అనేకమంది భక్తులు వస్తారని అలాంటి పవిత్ర స్థలంలో సౌండ్ సిస్టం నిర్వహణ అన్యమతస్తులకు కట్టబెట్టిన అధికారులను తక్షణమే నిధుల నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇతర మతస్తులకు పనులు అప్పజెప్పిన కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టి కాంట్రాక్టు రద్దు చేయాలని బిజెపి నాయకులు మేడబోయిన శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
