దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి


సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 22: ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని లబ్ధిదారులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి పేర్కొన్నారు. మంగళవారం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నార్కెట్పల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన గ్రామసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు లబ్ధిదారులు ప్రజా పాలన దరఖాస్తు ఫామ్ తో పాటు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని అనంతరం అధికారులు కులగనన, ఇంటింటి సర్వే ద్వారా దరఖాస్తులు తీసుకున్నారని ప్రస్తుతం గ్రామసభల ద్వారా కూడా దరఖాస్తులను తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రక్రియ ఇంతటితో ఆగిపోదని ఒకవేళ దూర ప్రాంతాలకు చెందిన వారు ఎవరైనా ఉంటే ఈనెల 24 తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చని అప్పటికి వీలు కాని వారు జిల్లా కలెక్టరేట్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతిరోజు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నదన్నారు. ఇటీవల సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షమవుతున్న జాబితాలను నమ్మవద్దన్నారు. ఎంపీడీవో, కలెక్టర్, ఎమ్మెల్యే, మినిస్టర్ తదితరులు చెప్పిన అంశాలను మాత్రమే నమ్మాలని సూచించారు. దరఖాస్తులకు సంబంధించి కానీ, లబ్ధిదారుల విషయానికి సంబంధించి గాని ఎలాంటి అనుమానాలు ఉన్నా స్థానిక ఎంపీడీవోని కలిసి నివృత్తి చేసుకోవాలన్నారు. గ్రామ సభలలో ప్రకటించిన జాబితా కేవలం ఎలిజిబులిటీ జాబితా మాత్రమేనని ఇది సాంక్షన్ లిస్ట్ అనుకోవద్దని సూచించారు. ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి వ్యవసాయ భూమి లేని రైతు కూలీల లో 2023-24 ఆర్థిక ఉపాధి హామీ పనిలో కనీసం 20 రోజుల పైన పనిచేసిన వారికి మాత్రమే ఆత్మీయ భరోసా పథకం పొందేందుకు అర్హత ఉంటుందని స్పష్టంగా తెలియపరిచారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వీరేశం

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయి: ఎమ్మెల్యే వీరేశం

అర్హులైన ప్రతీ లబ్ధిదారునికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. మంగళవారం నార్కట్పల్లి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామసభకు ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు ఒక్క ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఇవ్వకపోవడం వల్ల లబ్ధిదారులు ఎక్కువ సంఖ్యలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని మా ప్రభుత్వం నాలుగు రోజులు ఆలస్యం అయినా ప్రతి ఒక్కరికి అంచలంచలుగా సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రతినిత్యం ప్రజలకు కూడు, గూడు కావాలని కొట్లాడే కమ్యూనిస్టులు అందిస్తున్న సహకారం మరువలేనిదని కొనియాడారు. అర్హులకు ఎవరికి అన్యాయం జరగదని నేను ప్రత్యక్షంగా గల్లి గల్లి తిరిగి అర్హులకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు లొడంగి శ్రావణ్ కుమార్, చిట్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐతరాజు యాదయ్య, మాజీ సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి వెంకన్న, మాజీ జెడ్పిటిసి దూదిమెట్ల సత్తయ్య, నాయకులు సట్టు సత్తయ్య, జేరిపోతుల భరత్, శ్రీపతి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ సభలో పాల్గొన్న గ్రామస్తులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *