నార్కెట్పల్లి ప్రజలు ఫైబర్ నెట్ సేవలను వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే వీరేశం


స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, అక్టోబర్ 27: ఇంటర్నెట్ సేవలు కేబుల్ టీవీ సేవలు కలిపి వినియోగదారులకు తక్కువ రేటుకు అందజేయడం అభినందనీయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. ఆదివారం నార్కట్పల్లి మండల కేంద్రంలో కేబుల్ ఆపరేటర్ గూడూరు అంజిరెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జి.ఎస్ ఫైబర్ నెట్ సేవలను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ గతంలో కేబుల్ టీవీ సర్వీసులు ఇంటర్నెట్ సేవలు వేరువేరుగా అందించడం వల్ల వినియోగదారులకు ఆర్థికపరమైన భారం పడేదని ఇప్పుడు రెండు సర్వీసులను కలిపి తక్కువ రేటుకు అందించడం వల్ల వినియోగదారులకు వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందజేయడం వల్ల అధిక స్పీడ్ తో ఇంటర్నెట్ వాడుకునేందుకు వినియోగదారులకు సులభం అవుతుందన్నారు. ఈ సేవలను నార్కెట్పల్లి ప్రజలు ఉపయోగించుకొని ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్లైన్ మార్కెట్ ద్వారా అనేకమైన అవకాశాలను పొందాలని సూచించారు.

జిల్లాలోనే మొట్టమొదటిగా ఏకకాలంలో రెండు సర్వీసులు : బడుగుల ఉపేందర్ యాదవ్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో నార్కెట్పల్లి పట్టణంలోనే మొదటిసారిగా సిటీ కేబుల్ మరియు ఇంటర్నెట్ సేవలను కలిపి అందించడం శుభ పరిణామం అని కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బడుగుల ఉపేందర్ యాదవ్ అన్నారు. పట్టణంలోని కేబుల్ ఆపరేటర్ ద్వారా ప్రజలు ఈ సేవలు పొందడం వల్ల ప్రజలకు 24 గంటలు 365 రోజులు నిరంతరాయంగా అందుతాయన్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించేందుకు ప్రతినిత్యం కేబుల్ ఆపరేటర్లు ప్రయత్నిస్తారని తెలిపారు. కేబుల్ రంగంపై 18 శాతం జిఎస్టి విధించడంతో అల్పాదాయ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కేబుల్ సేవలను 18 శాతం స్లాట్ నుంచి 5 శాతం స్లాట్ లోకి మార్చి పేద బలహీన వర్గాలపై జిఎస్టి భారాన్ని తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భకత్తుల ఉషయ్య, మాజీ జెడ్పిటిసి దూదిమెట్ల సత్తయ్య, మాజీ సర్పంచ్ పుల్లెంల అచ్చాలు, మాజీ ఎంపీటీసీ పాశం శ్రీనివాస్ రెడ్డి, నాయకులు వడ్డే భూపాల్ రెడ్డి, సామ కొండల్ రెడ్డి, జెర్రిపోతుల భరత్, ఎస్.కె సమద్, ప్రజ్ఞాపురం సత్యనారాయణ, కేబుల్ ఆపరేటర్ల సంఘం నాయకులు, వాస విద్యసాగర్, జెల్లా వెంకటేశ్వర్లు, పాటి వెంకట్ రెడ్డి, నడింపల్లి శ్రీహరి, కొప్పు శ్రవణ్, యాదగిరి రెడ్డి, కట్టంగూరు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *