నార్కెట్పల్లి మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 11: నార్కెట్పల్లి మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని బొబ్బలి వనజ అనంతరెడ్డి ఫంక్షన్ హాల్ లో తాజా మాజీ అధ్యక్షులు కన్నెబోయిన నరసింహ ఆధ్వర్యంలో జరిగిన మండల స్థాయి సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా దంతూరి సతీష్, ప్రధాన కార్యదర్శిగా దుబ్బ కృష్ణ, కోశాధికారిగా నడిగోటి శ్రీనివాస్, లను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవ అధ్యక్షునిగా గౌరీదేవి నరసింహ, గౌరవ సలహాదారులుగా ముంత వెంకన్న, తరాల నరసింహ, ఉపాధ్యక్షులుగా కట్ట సురేష్, తాడోజు అంజి కార్యవర్గ సభ్యులుగా వెంపటి లింగస్వామి, దేవరకొండ చిన్న ఉపేందర్, మాధగోని నరేష్, వెల్లంల వెంకన్న, బొడ్డుపల్లి అశోక్ లను ఎన్నుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *