స్వేచ్ఛ న్యూస్, సెప్టెంబర్ 16, నార్కెట్పల్లి: మనం నిర్వహించుకునే పండుగల వల్ల పర్యావరణానికి హానికలుగకుండా నిర్వహించడం వల్ల ప్రకృతిని కాపాడిన వారిమీ అవుతామని నార్కెట్పల్లి ఎస్సై క్రాంతి కుమార్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నార్కట్పల్లి పట్టణంలోని నల్లగొండ రోడ్డులో యువ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి వినాయక ప్రతిమ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ మనం ఎంత పెద్ద వినాయకున్ని పెట్టి పూజలు చేస్తున్నామని ఇతరులతో పోటీలు పడకుండా పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక ప్రతిమను ఏర్పాటు చేసి గత 9 రోజులుగా భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యువ యూత్ కమిటీ సభ్యులను అభినందించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసినప్పుడు జల కాలుష్యం ఏర్పడి జలచరాలు మరణిస్తాయన్నారు. ఇతరులకు హాని తలపెట్టకుండా అందరిని కలుపుకుపోయి సాటివారిని బంధువులుగా పరిగణించాలని మన శాస్త్రం చెప్తుందన్నారు. శాస్త్రం ప్రకారం నవరాత్రులు పూజలు చేసి నిమజ్జనం చేయాలని కానీ ఈ మధ్యకాలంలో కొందరు 15 రోజులు 20 రోజులు నిలబెట్టడం సరైన నిర్ణయం కాదన్నారు. నిమజ్జనం సమయంలో పోలీసు వారి సూచనలు పాటిస్తూ వారికి సహకరించాలని కోరారు. అనంతరం కన్నేబోయిన బ్రదర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భత్తుల ఉషయ్య, వడ్డే భూపాల్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కన్నెబోయిన సైదులు, వడ్డే భూపాల్ రెడ్డి, యువ యూత్ కమిటీ సభ్యులు కన్నెబోయిన నరసింహ, బోయపల్లి శ్రవణ్, ఎన్నపల్లి శశి, గోదల మహేందర్ రెడ్డి, సామ సత్తిరెడ్డి, జైపాల్, శివరాం రెడ్డి, రాచకొండ సాయి, సురబోయిన ప్రసాద్, గడ్డం కళ్యాణ్, రెడ్డిపల్లి నరేష్, శ్రీపతి గణేష్, కంచోజు నరేష్, ఎాపాల శంకర్, రెడ్డిపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.