పోషకాహారం తీసుకోవడం వల్ల అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు

స్వేచ్ఛ న్యూస్, సెప్టెంబర్ 27, నార్కెట్పల్లి: పోషకాహారం తీసుకోవడం వల్ల మన బాడీలోని ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఉండవచ్చని కామినేని వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధీర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం కామినేని మెడికల్ కాలేజ్ నార్కెట్పల్లి ప్రిన్సిపాల్ డా. బాబాసాహెబ్ కూడగి సారధ్యంలో నెమ్మాని జిల్లా పరిషత్తు పరిషత్తు ఉన్నత పాఠశాల మరియు అంగన్వాడి సెంటర్లలో పోషణమాస 2024 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డా.సుధీర్ బాబు పోషకాహార ప్రాముఖ్యత గురించి వివరించారు, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా. మారుతీ శర్మ, డా.రత్న బాలరాజు లు మాట్లాడుతూ ఇంట్లో వాడుకునే కూరగాయలు, పండ్లు, గింజెలు, నిత్యవసరాలనుండి అతి తక్కువ ఖర్చుతో పోషకాహారం ఎలా తీసుకోవాలో సూచించారు, డాక్టర్ అశోక్ దేవ్ మాట్లాడుతూ పిల్లలకు, బాలికలకు, బాలింతలకు, గర్భిణులకు పోషన్ మాన్-2024 గురించి పోషన్అభ్యన్ కరిక్రమ సేవల వినియోగం గురించి అవగాహన కలిగించారు, నార్కెట్పల్లి సి.హ్.ఓ శ్రీరాములు మాట్లాడుతూ పిల్లలకు, బాలికలకు, గర్భిణీలకు మరియు బాలింతలకు పోషకాహార ప్రాముఖ్యత గురించి అవగాహన కలిపించారు, డా.లావణ్య గారు మాట్లాడుతూ అందరూ పోషక ఆహారం తీసుకోవాలని కోరారు, ప్రధానోపాధ్యాయురాలు నీరజ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కామినేని మెడికల్ కాలేజీ హాస్పటల్ డాక్టర్లకు అభినందనలు తెలియజేశారు. పిల్లలకి, కౌమార బాలికలకి, బాలింతలకు గర్భిణులకు అరటి పండ్లు,మొలకెత్తిన గింజలు, అటుకుల పోహ పంచడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఓం ప్రకాష్, కామినేని వైద్య కళాశాల విద్యార్థిని విద్యార్థులు, జిల్లా పరిషత్ పాఠశాల నెమ్మాని ప్రధానోపాధ్యాయురాలు నీరజ, ఉపాధ్యాయులు, ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజలి గారు,ఎం.ఎస్.డబ్లు స్వామి, బేబీ సరోజిని, పరశురామ్, సైదులు, సిస్టర్స్ స్వాతి, అనూష, రమణ తబస్సుమ్,మేరి, పరిపాటి గోపాల్.హెల్త్ అసిస్టెంట్స్ బద్దం నగేష్ , గడ్డం రమేష్, అంగన్వాడీ టీచర్లు రమా దేవి, దేవేంద్ర, పద్మ మరియు ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *