
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్టు 3: ఇటీవల రద్దీప్రాంతాలలో డూప్లికేట్ తాళం చేతులతో బైక్ లను దొంగిలించి జల్సాలకు అలవాటుపడ్డ నిందితులను శనివారం నార్కెట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇనుపాముల గ్రామానికి చెందిన తిరుగుడు సతీష్ చెరువుగట్టు గుట్టపైన తన పల్సర్ బైక్ ను పార్క్ చేసి దైవదర్శనానికి వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తులు తన బండిని దొంగిలించారని నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల జిల్లాలో పెరిగిన వాహన దొంగతనాల కేసులపై ఎస్పీ శరత్చంద్ర పవర్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని అమ్మనబోలు రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకుని బండి పేపర్లు చూపించాలనగా ఎలాంటి పేపర్లు చూపలేదు అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేపట్టగా రామన్నపేట మండలానికి చెందిన మట్టిపల్లి శ్రీకాంత్, మట్టిపల్లి వెంకన్న, మట్టిపల్లి అనిల్ వీరు ముగ్గురు అన్నదమ్ములు జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించవచ్చన్న దురాశతో నార్కెట్పల్లి, చిట్యాల, సూర్యాపతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని నరసరావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, గుంటూరు, కృష్ణ తదితర ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. వీరిపై ఇప్పటికే తెలంగాణలో 6 కేసులు, ఆంధ్రలో 1 కేసు నమోదయింది. మొత్తం 7 కేసులలో సుమారు 16 లక్షల విలువైన 12 బైకులను (07 పల్సర్ లు, 02 గ్లామర్ బైక్ లు, 1 hf డీలక్స్, 1 స్ప్లెండర్, 1 tvs స్కూటీ) లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. A1 మట్టిపల్లి శ్రీకాంత్ వేరే కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైలులో ఉన్నాడని త్వరలో అదుపులోకి తీసుకొని మరిన్ని వివరాలు తెలియపరుస్తామని మిగిలిన ఇద్దరు నిందితులను శనివారం రిమాండ్ కు తరలించినట్లు డి.ఎస్.పి పేర్కొన్నారు. ఈ కేసును తన పర్యవేక్షణలో నార్కెట్పల్లి సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఎస్సై క్రాంతి కుమార్ సిబ్బంది రాము, జవహర్, రమేష్, సత్యనారాయణ కానిస్టేబుళ్లు సత్యనారాయణ, కృష్ణ, శివ, తిరుమలేష్ లు చేదించారని, వీరిని జిల్లా ఎస్పీ అభినందించి నగదు బహుమతి ప్రకటించారని తెలిపారు.
