
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్టు 4: ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు బైక్ లపై గంజాయి తరలిస్తున్న నిధులను అరెస్టు చేసిన కేసు వివరాలను సోమవారం నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి శివరామిరెడ్డి వెల్లడించారు. పోలీసుల కళ్ళు కప్పి గంజాయిని తరలించి సులువుగా డబ్బు సంపాదించి జల్సాలు చేసుకోవచ్చనే దురుద్దేశంతో ఒరిస్సా రాష్ట్రం మాల్కం గిరి జిల్లా కలిమెల కు చెందిన A1 నిందితుడు బాదల్ తక్కువ ధరకు గంజాయి కొని హైదరాబాదులో ఎక్కువ ధరకు అమ్మితే సులువుగా డబ్బు సంపాదించని అదే ప్రాంతానికి చెందిన జీబన్ డెపారి, కిరణ్ బైద్య, సుధాసేన్ సాలె తోపాటు మరో బాల నేరస్తుడిని కొరియర్స్ గా గంజాయిని హైదరాబాదుకు చేరిస్తే ఒక్కొక్కరికి 3000/- రూపాయలు ఇచ్చే విధంగా మాట్లాడుతున్నారు. ఎవరికి అనుమానం రాకుండా బైక్ డిక్కీ తో పాటు సీటు కింద ఉన్న ఫోమ్ మొత్తం తీసివేసి ఆ భాగంలో గంజాయి ప్యాకెట్లు ఏర్పాటు చేసుకొని 1,75,000 విలువ గల 07 కేజీలం గంజాయిని 2 బైకులలో తరలిస్తున్నారు. మార్గమధ్యలో బైక్ లకు నెంబర్ ప్లేట్లు మారుస్తూ ఎవరికి అనుమానం రాకుండా తరలిస్తున్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ గత కొంతకాలంగా గంజాయి ముఠాలపై మోపుతూ గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయగా ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం 65వ నెంబర్ జాతీయ రహదారిపై హోటల్ వివేరా ప్రాంతంలో వాహన తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా కనిపించిన వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా నిందితులు వాడిన వాహనాల నెంబర్ ప్లేట్లు అసలైనవి కావని తేలింది. తమదైన శైలిలో విచారించగా నిందితులు నేరం ఒప్పుకున్నారని తెలిపారు. నిందితుల నుంచి గంజాయితోపాటు 2 బైకులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.
గంజాయి రవాణా, వినియోగం, విక్రయం అంశాలపై జిల్లా ఎస్పీ చాలా సీరియస్ గా పనిచేస్తున్నారని ప్రజలు గంజాయి కి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్న వెంటనే డయల్ 100 కు లేదా 8712670266 కు ఫిర్యాదు చేయాలని ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంటుందని తెలిపారు. గంజాయి నిర్మూలనకు పోలీస్ వారికి ప్రజలు సహకరించినట్లయితే వీలైనంత త్వరగా గంజాయి రహిత నల్గొండ గా మారవచ్చన్నారు. ఈ కేసును తన పర్యవేక్షణలో నార్కెట్పల్లి సీఐ నాగరాజు ఆధ్వర్యంలో చేదించిన నార్కెట్పల్లి ఎస్సై క్రాంతి కుమార్ తోపాటు సిబ్బంది ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
