భూ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా రాబోయే చట్టం ఉండాలి

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్టు 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయబోతున్న ROR రెవెన్యూ చట్టానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ లో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి నార్కెట్పల్లి పరిరక్షణ సమితి (NPS) తరపున హాజరైన ఎన్ పి ఎస్ నాయకులు కన్నెబోయిన నరసింహ రెవిన్యూ చట్టానికి సంబంధించి పలు సూచనలు చేయడం జరిగింది.

1)చట్టంలో పొందుపరిచిన విధంగా రిజిస్ట్రేషన్ కు ముందు కచ్చితంగా సర్వే చేసి హద్దులు పేర్కొనాలని చట్టంలో చెప్పబడింది దీనికిగాను చాలా గ్రామాలలో టి-ఫన్స్ లేకపోవడం వల్ల సర్వే చేయడానికి అంతరాయాలు కలుగుతున్నాయని అలాంటి సందర్భంలో రిజిస్ట్రేషన్ ముందు సర్వే తప్పనిసరి అనే నిబంధన రైతులను ఇబ్బందికి గురి చేస్తుందని చెప్పడం జరిగింది.

అదేవిధంగా రిజిస్ట్రేషన్ అనంతరం మ్యూటేషన్ జరుగుతున్న క్రమంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆర్జీదారులు తమ సమస్యలను చెప్పుకునే విధంగా రిజిస్ట్రేషన్ కు మ్యూటేషన్కు మధ్య కొంత సమయాన్ని ఇవ్వడం వల్ల సమస్యలను సరిదిద్దడానికి అవకాశం ఉంటుందని సూచించడం జరిగింది.

అదేవిధంగా గతంలో అమెండ్మెంట్ కాపీ పట్టాదారులకు ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండేదని అమెండ్మెంట్ రికార్డు ద్వారా ఆ భూమి ఎవరి పేరు మీద నుంచి ఎవరి పేరు మీదికి ఏ విధంగా వచ్చింది అనే ప్రతి అంశం తెలుసుకోవడానికి అవకాశం ఉండేదని ఇప్పుడున్న చట్టంలో అమెండ్మెంట్ అనేది లేకుండా పోయిందని దానివల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని వచ్చే చట్టంలో కచ్చితంగా అమెండ్మెంట్ రిజిస్టర్ మైంటైన్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది.

అదేవిధంగా పహనీల నిర్వహణ అనేది కొత్త చట్టంలో ఏర్పాటు చేయడం జరిగిందనీ దీనికి గతంలో విఆర్వోలు, వీఆర్ఏలు పహనీలు రాయడం వల్ల అధికారులు తప్పుగా రాసిన పహానీలను పట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ అనేక మంది రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ఈ పహానిల నిర్వహణ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుందా లేదా ఎవరినైనా అపాయింట్ చేస్తారా అనే విషయంలో స్పష్టత రావాలని కోరడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *