తాజాగా మరోసారి లావణ్య పై కేసు నమోదైంది. లావణ్య తన సోదరుడికి మెసేజ్ చేసి పంపిస్తోందని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మాల్వి మల్హోత్రా ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఫిల్మ్‌నగర్ పోలీసులు లావణ్యపై కేసు నమోదు చేశారు.
సినిమా రేంజ్ ట్విస్టులతో రాజ్ తరుణ్ కేసు ఆసక్తికరంగా మారుతుంది. ఈ వ్వహరంలో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. తనను ప్రేమించి మోసం చేశాడని, పదేళ్లు తనతో రిలేషన్ షిప్ లో ఉండి.. ఇప్పుడు మాల్వీ అనే మరో హీరోయిన్‌తో ఉంటున్నాడని హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టికతన సంగతి తెలిసిందే. అయితే రాజ్‌తరుణ్‌పై కేసు పెట్టిన లావణ్యకే షాకిచ్చారు పోలీసులు. సరైన ఆధారాలు సమర్పించాలంటూ CRPC కింద నోటీసులు జారీ చేశారు. తాజాగా మరోసారి లావణ్య పై కేసు నమోదైంది. లావణ్య తన సోదరుడికి మెసేజ్ చేసి పంపిస్తోందని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మాల్వి మల్హోత్రా ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో ఫిల్మ్‌నగర్ పోలీసులు లావణ్యపై కేసు నమోదు చేశారు.