స్వేచ్ఛ న్యూస్, హైదరాబాద్, జనవరి 28: తెలంగాణ రాష్ట్రంలో రెండవ శ్రీశైలం గా ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల ప్రచార పోస్టర్ ను మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా శాంతిభద్రతలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. దేవస్థాన అభివృద్ధికి సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ల చేతుల మీదుగా పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా ఆహ్వాన పత్రికలను మంత్రులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్య నిర్వహణ అధికారి నవీన్, ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, నార్కెట్పల్లి మాజీ జెడ్పిటిసి దూదిమెట్ల సత్తయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఉశయ్య, నాయకులు నేతగాని కృష్ణ, సట్టు సత్తయ్య, వడ్డే భూపాల్ రెడ్డి, గడ్డం పశుపతి, రేగట్టే రాజశేఖర్ రెడ్డి, గడుసు శశిధర్ రెడ్డి, యానాల రాంరెడ్డి, జెర్రిపోతుల భరత్, మేకల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.