స్వేచ్ఛ న్యూస్, ఖమ్మం, 10.07.2024:
రైతు భరోసా పథకం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు
● రాష్ట్ర ఆర్థిక పురోగతికి, ప్రజల జీవన భృతికి దోహదపడుతున్న రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీగా హామీ ఇచ్చాం.
● ఇచ్చిన హామీని అమలు చేయడం కోసం ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది.
● గత ప్రభుత్వం విడుదల చేయకుండా పెండింగ్ లో పెట్టిన రైతుబంధు నిధులను సమయానుకూలంగా ప్రజా ప్రభుత్వం విడుదల చేసింది.
● పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంటు బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం జరిగింది.
● ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది.
● ఈ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రైతు భరోసా పథకం అమలుపై విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ నియామకం చేసింది.
● ఈ సబ్ కమిటీలో ఉప ముఖ్యమంత్రిగా నేను, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, దుద్దిల శ్రీధర్ బాబు సభ్యులుగా ఉన్నాము
● రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ సమావేశం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించి.. ఈ పథకం అమలు కోసం ఉమ్మడి పది జిల్లాల్లో పర్యటన చేసి ప్రజలు రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి విధివిధానాలు రూపొందించాలని నిర్ణయించాం.