రోడ్డుకు ఇబ్బందిగా మారిన మోరీ నిర్మానాన్ని నిలిపివేయాలి


మోరి నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఎన్ పి ఎస్ నాయకులు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, నవంబర్ 21: ప్రయాణికులను ఇబ్బందికి గురి చేస్తూ ప్రభుత్వ స్థలాన్ని అడ్డగోలుగా ఆక్రమిస్తూ నిర్మిస్తున్న మోరి నిర్మాణాన్ని వెంటనే ఆపాలని నార్కెట్పల్లి పరిరక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని మసీదు వెనుక భాగంలో మాండ్ర గ్రామానికి వెళ్లే దారికి ఇబ్బంది కలిగే విధంగా మోరీనిర్మానాన్ని చేపడుతున్నారని గతంలో ఉన్న మోరీ స్థానంలో కాకుండా సుమారు 6 ఫీట్ల దూరం జరిగి దారివైపు నిర్మించడం వల్ల మాండ్ర, చౌటబావి, తదితర గ్రామాలకు వెళ్లే వాహనాలకు మళ్లడానికి ఇబ్బంది అవుతుందని గతంలో పలుమార్లు లారీలు మోరిలో దిగబడిన సందర్భాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పూర్వం మోరీ ఉన్న స్థలంలోనే నూతనమోరి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన సెప్టిక్ ట్యాంకులను తొలగించి మోరీ నిర్మాణం చేపట్టాలన్నారు. ఓట్ల రాజకీయాలతో ఒక వర్గానికి కొమ్ముకాస్తూ ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్న రాజకీయ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. పాతమోరి స్థానంలోనే కొత్తమోరీ నిర్మాణం చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్పినప్పటికీ ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. ప్రభుత్వాధికారులు వెంటనే నివారణ చర్యలు చేపట్టాలంటూ పంచాయతీ కార్యదర్శి కి, స్థానిక ఎంపీడీవో కి వినతి పత్రం అందజేశారు. అధికారులు తక్షణమే స్పందించకుంటే అక్రమ నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెడబోయిన శ్రీనివాస్, నోముల నాగరాజు, కన్నెబోయిన నరసింహ, నడింపల్లి శ్రవణ్, మునుకుంట్ల గణేష్, పాలకూరి రమేష్, వడ్డేగోని రామలింగం, అనంతుల నాగరాజు, ఉండ్రాతి అంజి తదితరులు పాల్గొన్నారు.


పంచాయతీ కార్యదర్శి కి వినతి పత్రం అందజేస్తున్న ఎన్ పీ ఎస్ నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *