
స్వేచ్చ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్ట్ 08: పట్టణంలోని రెడ్డయా ఫ్యాక్టరీ నుంచి కామినేని జంక్షన్ వరకు గత శాసనసభ ఎన్నికలకు ముందు చేపట్టిన రహదారి విస్తరణ పనులు 2 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ పూర్తిగాకపోవడం శోచనీయమని బిజెపి మండల అధ్యక్షులు మేడబోయిన శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంజేశారు. శుక్రవారం స్థానిక MPDO కు వినతిపత్రం అందజేసిన అనంతరం మాట్లాడుతూ రోడ్డు పనులు చేయకపోడం వలన పట్టణ ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు రోడ్డు నుంచి వచ్చే దుమ్ము ధూళితో శ్వాసకోశ సమస్యలకు గురవుతున్నారని రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా నిర్మించడం వలన ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నారని ఈ మధ్య జరిగిన ప్రమాదాల్లో మరణాలు కూడా సంభవిన్చాయని అంతేకాకుండా నల్గొండ చౌరస్తా వద్ద చిన్నపాటి వర్షానికి చెరువుని తలపించే విధంగా నీళ్లు నిలుస్తున్నాయని దీనితో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నారు. బిజెపి ఆధ్వర్యంలో పలుమార్లు అధికారులను కలిసి విన్నమించడం జరిగిందని గతనెల 3న నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ని కలిసి వినతి పత్రం ఇవ్వగా జులై 6వ తేదీ నుంచి రహదారి విస్తరణ పనులు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది కానీ రోజులు గడుస్తున్నా నేటికీ విస్తరణ పనులు చేపట్టకపోవడం దురదృష్టకరమని దీనిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఇప్పటికైనా తక్షణమే విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని ఎడల బిజెపి తరఫున పట్టణ ప్రజల సహకారంతో రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు నోముల నాగరాజు, ప్రదాన కార్యదర్శి బిళ్ళకంటి శ్రీకాంత్, సీనియర్ సిటిజన్ పాల్వాయి భాస్కర్ రావు, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లెబోయిన రామలింగం, యువ నాయకులు పాలకూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
