స్వేచ్ఛ న్యూస్, సెప్టెంబర్ 1, నల్గొండ: గత కొన్ని సంవత్సరాలుగా ఇంటికొక స్పీకర్ ఊరికి ఒక ట్రైనర్ అనే కాన్సెప్ట్ తో పనిచేస్తున్న ఇంపాక్ట్ సంస్థ రానున్న కాలంలో సమాజ శ్రేయస్సు ను దృష్టిలో పెట్టుకొని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఇంపాక్ట్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సోను పేర్కొన్నారు.
ఆదివారం నల్లగొండ పట్టణ కేంద్రంలో నిర్వహించిన ఇంపాక్ట్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ తరపున నూతనంగా ఏర్పాటు చేసిన 20 క్లబ్ ల ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలన్న లక్ష్యంతో ఇంపాక్ట్ సంస్థ పనిచేస్తుందని అందులో భాగంగా ఐసిఐ ద్వారా ప్రజలకు వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రీజనల్ ప్రెసిడెంట్ నూనె సుదర్శన్ డైరెక్టర్లు డాక్టర్ మట్ట చెన్నయ్య గౌడ్, కోట సరిత కో ఆర్డినేటర్లు గూడూరు అంజిరెడ్డి, కోట్ల సాయి కిరణ్, కవిత & వివిధ క్లబ్ ప్రతినిధులు మరియు సభ్యులు పాల్గొన్నారు