స్వేచ్ఛ న్యూస్, నల్గొండ, 11 జులై 2024: నల్లగొండ సబ్ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ సర్వర్ డౌన్ కావడంతో ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఒక్క రిజిస్ట్రేషన్ కూడా కాలేదు వేరే వాళ్లకు వెళ్తే వాణిజ్య సముదాయాలు, ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ నిమిత్తం నల్లగొండ సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్దాం అనుకొని వచ్చిన వారికి నిరాశ మిగిలింది ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు సర్వ రాకపోవడం వల్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బందిని అడగగా ఉదయం 2 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని ఆ తర్వాత సి.సి.ఎల్.ఎ సర్వర్ ఓపెన్ కాకపోవడంతో డాక్యుమెంట్స్ అన్ని పెండింగ్లో పెట్టాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏదైనా సర్వర్ షట్ డౌన్ అయినట్లయితే 5-10 నిమిషాల వ్యవధిలోనే తిరిగి అందుబాటులోకి తీసుకొస్తున్నారని కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైన ఆదాయం వనరుగా మారిన సబ్ రిజిస్టర్ సర్వర్ ను ఉదయం నుంచి సాయంత్రం దాకా పునరుద్ధరించకపోవడం అనుమానాలకు తావిస్తుందని రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు వచ్చిన ప్రజలు ఆరోపిస్తున్నారు.