
స్వేచ్ఛ న్యూస్, నల్లగొండ, డిసెంబర్ 29: క్రమశిక్షణతో కూడిన రోజువారి జమలతో సహకార సంఘాలను సద్వినియోగం చేసుకొని వాటి ద్వార ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సహకార సంఘాల కార్పొరేషన్ అసిస్టెంట్ రిజిస్టార్ అనురాధ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని సహకార సంఘాల కార్యాలయంలో నార్కెట్పల్లి కిచెందిన సాయి నిధి కోఆపరేటివ్ సొసైటీ కి సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పేదలు ధనికులుగా మారాలంటే నిత్య పెట్టుబడి అనేది ఉత్తమమైన మార్గమని సూచించారు.
