స్వేచ్ఛ న్యూస్, డిసెంబర్ 17, నార్కెట్పల్లి: నార్కట్పల్లి మండల కేంద్రంలో గ్రామ ఖంటానికి చెందిన కూరగాయల అంగడి స్థలంలో హనుమద్గాయత్రీ యజ్ఞం నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆంజనేయ స్వాములు, నార్కట్పల్లి పరిరక్షణ సమితి తరపున మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ లకు వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీకి చెందిన గ్రామ కంఠం భూమిలో గత 70-80 సంవత్సరాలు గా మండల, పట్టణ ప్రజలందరూ అన్ని రకాల రాజకీయ, సాంస్కృతిక, దైవ కార్యక్రమా లు నిర్వహించుకుంటున్నట్టు అధికారుల దృష్టికి తీసుకువెళ. అదేవిధంగా గ్రామపంచాయతీ ఆధీనంలో పశువుల సంత, కూరగాయల సంత కూడా నిర్వహిస్తున్నట్లు అధికారులకు వివరించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరిరక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ కోర్టు తీర్పు కాపీలు, గ్రామపంచాయతీ తీర్మానాలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచనామా రిపోర్ట్ లు అన్ని జిల్లా అధికారులకు సమర్పించినట్లు తెలిపారు. వీలైనంత తొందరగా సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని కలెక్టర్, ఎస్పీలు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించి ప్రభుత్వ భూమిని కాపాడాలని విన్నవించామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, బీజేవైఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పజ్జురు వెంకటరెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు కొరవి శంకర్, నాయకులు మెడబోయిన శ్రీనివాస్, నడింపల్లి శ్రవణ్ కుమార్, వడ్డగోని రామలింగం, నార్కెట్పల్లి పరిరక్షణ సమితి సభ్యులు కన్నెబోయిన నరసింహ, బనాల భాస్కర్ రెడ్డి, పుల్లెంల మహేష్ తదితరులు పాల్గొన్నారు.