పుష్పక్క పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 8, నార్కెట్పల్లి: తెలంగాణ మలిదశ ఉద్యమంలో గలమెత్తిన కళాకారిని, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్పక్క పుట్టినరోజుని పురస్కరించుకొని శనివారం నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలో మనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మాజీ జడ్పిటిసి దూదిమెట్ల సత్తయ్య యాదవ్ సతీమణి అండాలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ పుష్పక్క ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవున్ని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నార్కెట్పల్లి మాజీ సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి వెంకన్న, మట్టిపల్లి రాజు, కంబాలపల్లి లింగస్వామి, ముక్కిరి మహేష్, జెనిగ ఐలయ్య, వెంకన్న, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *