నగరోత్సవంతో ముగిసిన చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు

WhatsApp Image 2026 01 30 at 19.18.27

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 30: చెరువుగట్టు శ్రీ పార్వతి జడలరామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం గట్టు కింద చెరువుగట్టు, ఎల్లారెడ్డిగూడెం గ్రామాలలో గజవాహనముపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు నిర్వహించారు. ఇఓ మోహన్ బాబు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంబించారు. ప్రత్యేక లైట్ల అలంకరణతో చేసిన ఏర్పాట్లు, వివిధ వేషధారణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

WhatsApp Image 2026 01 30 at 19.18.25 1

ఈ సందర్భంగా గ్రామస్తులు తమ ఇంటి ముందుకి వచ్చిన ఆదిదంపతులకు నివాళులతో స్వాగతం పలికి, నీళ్లు ఆరబోసి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవాలలో చివరి అంకం ఊరేగింపుతో పూర్తవుతుంది. ఊరేగింపు అనంతరం అమ్మవారిని గట్టు కింద ఆలయంలో ప్రవేశింపజేస్తారు. అదేవిధంగా స్వామివారిని గట్టుపైన ఆలయంలో ఆసీనులుగావించారు. ఈ కార్యక్రమంలో ఈవో మోహన్ బాబు, చెరువుగట్టు సర్పంచ్ నేతగాని కృష్ణ, ఉత్సవ కమిటీ చైర్మన్ వారాల రమేష్, రేగట్టే నవీన్ రెడ్డి, గడుసు శశిధర్ రెడ్డి, ధర్మకర్తలు కమ్మలపల్లి మల్లేష్, ఇడుకుళ్ళ సంపత్, రాజశేఖర్ రెడ్డి, గౌరీ దేవి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026 01 30 at 19.18.25

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *