బలమైన యువతను తీర్చిదిద్దడమే లక్ష్యంగా సంసద్ క్రీడోత్సవాలు

WhatsApp Image 2026 01 31 at 15.44.31
విజేత కట్టంగూరు జట్టుతో నిర్వాహకులు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 31: శారీరకంగా మానసికంగా దృఢమైన యువతను తీర్చిదిద్ది యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచుతూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బాటలు వేయడమే లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రేరణతో ప్రధానమంత్రి సంసద్ క్రీడా మహోత్సవం నిర్వహిస్తున్నామని 2025-26 క్రీడోత్సవాల నకిరేకల్ ఇంచార్జి పజ్జురి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గత 10 రోజులుగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం ఆధ్వర్యంలో నార్కెట్పల్లి మండలంలోని నెమ్మాని గ్రామంలో నిర్వహిస్తున్న సంసద్ క్రీడోత్సవంలో 40 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. శుక్రవారం నిర్వహించిన ఫైనల్ మ్యాచ్ లో రామన్నపేట మండలం వెల్లంకి టీం తో కట్టంగూరు టీం తలపడగా కట్టంగూరు టీం విజేతగా నిలిచిందని వెల్లంకి టీం రెండవ స్థానం లో నిలిచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పబ్బు వెంకన్న, మండల అధ్యక్షులు మెడబోయిన శ్రీనివాస్, నాయకులు పాల్వాయి భాస్కర్ రావు, వడ్డే గోని రామలింగం క్రీడల నిర్వహకులు పుల్ల సందీప్ రెడ్డి, పాలకూరి రమేష్, నోముల నాగరాజు, పామనగుండ్ల శివ, ఉండ్రాతి అంజి, సందీప్, రాజేందర్రెడ్డి, లాలుప్రసాద్, శ్రీకాంత్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
WhatsApp Image 2026 01 31 at 15.44.31 1
రన్నర్ వెల్లంకి జట్టుతో నిర్వాహకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *