అనుమతులు లేకుండా నిర్మించిన చర్చిని తొలగించాలంటూ తాసిల్దార్ కు వినతి

WhatsApp Image 2026 02 21 at 13.53.48

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, ఫిబ్రవరి 21: ఇంటి నిర్మాణం పేరుతో అనుమతి తీసుకొని అక్రమంగా నిర్మించిన చర్చి ని తొలగించాలని కోరుతూ బిజెపి నాయకుల ఆధ్వర్యంలో స్థానిక మహిళలు తహసిల్దార్ కు ఫిర్యాదు చేసిన సంఘటన శనివారం నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. బిజెపి మండల అధ్యక్షుడు మెడబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ జయరాజు అనే వ్యక్తి ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకొని రాఘవేంద్ర కాలనీలో అక్రమంగా చర్చి నిర్మాణం చేసి ఇతర ప్రాంతాల నుంచి జనాలను తీసుకొచ్చి మైకులు పెట్టి రాత్రి పగలు తేడా లేకుండా ప్రార్థనల పేరుతో భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. గతంలో పలుమార్లు చర్చి ఫాదర్ కు ఇక్కడి నుండి చర్చిని వేరే ప్రాంతానికి మార్చాలని చెప్పడంతో గ్రామ శివారులో భూమి కొనుగోలు చేశానని త్వరలోనే అక్కడికి మారుస్తానని చెప్పిన పాస్టర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడని తెలిపారు. ఈ ప్రాంతంలో క్రైస్తవ మతాన్ని ఆచరించేవారు ఎవరూ లేనందున పరిసర ప్రాంత ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని చర్చిని తొలగించాలని తహసిల్దార్ కు విన్నవించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నోముల నాగరాజు, వార్డు మెంబర్లు వడ్డేగోని రామలింగం, పాలకూరి రమేష్, సీనియర్ సిటిజన్ పాల్వాయి భాస్కరరావు, మాజీ వార్డు మెంబర్ మట్టిపల్లి రాజు, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *