నార్కెట్పల్లి జర్నలిస్టు యూనియన్ అధ్యక్షునిగా పసునూరి శేఖర్

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జూలై 8: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) అనుబంధ సంఘం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (TUWJ నార్కెట్పల్లి మండల అధ్యక్షులుగా నార్కట్పల్లి పట్టణానికి చెందిన ఆంధ్రప్రభ విలేకరి పసుమూరు చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో tuwj జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు ప్రజ్ఞాపురం శివశంకర్, సహాయ కార్యదర్శి భాశెట్టి శ్రీనివాస్, నల్గొండ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి గర్దాసు వెంకన్న ల సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా దేవరశెట్టి నారాయణ, గౌరవ సలహాదారులుగా భాషెట్టి శ్రీనివాస్, ప్రజ్ఞాపురం శివశంకర్ లు, ఉపాధ్యక్షులుగా బండారు రాంబాబు, మంద శివ (చంటి), ప్రధాన కార్యదర్శిగా పల్లె తిరుమలేష్, సహాయ కార్యదర్శులుగా దుబ్బాక నరేష్, బండారు చందు, కోశాధికారిగా సోమ వెంకటరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాధారపు రమేష్, కమిటీ సభ్యులు ప్రజ్ఞాపురం కృష్ణ, కన్నెబోయిన నరసింహ, సురిగి కృష్ణ, సిరి శెట్టి సంతోష్ తదితరులను ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గార్లపాడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రతినిత్యం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తారని వారి అభివృద్ధి కన్నా ప్రజాభివృద్ధిని కాంక్షిస్తారని తెలిపారు. అలాంటి జర్నలిస్టులు ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారని వారిని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు భరించలేక సతమతమవుతున్న జర్నలిస్టుల పిల్లలకు రాయితీతో కూడిన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందన్నారు. నూతన కమిటీకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ సంఘం అభివృద్ధికి కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు.
నూతన అధ్యక్షుడు పసునూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన పెద్దలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మండలంలోని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. అందరి సహకారంతో సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *