
స్వేచ్చ న్యూస్, హయతనగర్, అక్టోబర్ 17: ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ విజన్ బిల్డర్స్ ఆధ్వర్యంలో శనివారం హయత్ నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ విజన్ బిల్డర్స్ క్లబ్ ప్రెసిడెంట్ గూడూరు అంజిరెడ్డి మాట్లాడుతూ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సమాజంలోని యువతలోని చెడు రుగ్మతలను పోగొట్టేందుకు, సమాజ అభివృద్ధి కోసం సమాజ సేవ చేసేందుకు ముందుంటుందన్నారు. ఈ సందర్బంగా Dr: రవీందర్ మాట్లాడుతూ స్వచ్చంద సేవా సంస్థలు ఆసుపత్రి లో బెంచీలు ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అనంతరం క్లబ్ సెక్రటరీ నందికొండ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంపాక్ట్ స్వచ్ఛంద సేవా సంస్థలో చేరి సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో Dr గోపాల్, Dr కళ్యాణి, గైనకాలజిస్ట్, క్లబ్ ట్రెజరర్ బాలు చౌహాన్, బెలిదే శ్రీకాంత్, లావుడి వీర, వెంకటేశం గౌడ్, గుత్తా ప్రవీణ్ రెడ్డి, బానోతు శ్రీనివాస్, మెరుగు శ్రవణ్, గజ్జల శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
