ఆప్త మిత్రుని కుటుంబానికి అండగా స్వాన్ సంస్థ

WhatsApp Image 2026 11 19 at 15.02.46

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, నవంబర్ 19: అనారోగ్యంతో అసువులు బాసిన స్నేహితుని కుటుంబానికి అండగా స్వాన్ (స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ నార్కట్పల్లి) సంస్థ ఉంటుందని మరొకసారి నిరూపించారు స్వాన్ సంస్థ సభ్యులు. వివరాల్లోకి వెళితే నార్కెట్పల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయుడు సత్తిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న సంస్థ స్వాన్ (SWAN) ఈ సంస్థలో సభ్యత్వం తీసుకున్న తోటి మిత్రుడు, మిత్రురాలు అనివార్య కారణాలవల్ల మరణించినట్లయితే వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలనె లక్ష్యంతో పూర్వ విద్యార్థులందరూ కలిసి సంస్థ ద్వారా ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తారు. అందులో భాగంగా 2009 బ్యాచ్ విద్యార్థి నార్కెట్పల్లి పట్టణానికి చెందిన రావుల గణేష్ గురువారం ఆకస్మికంగా మరణించడంతో సంస్థ నిబంధనల మేరకు దహన సంస్కారాల కార్యక్రమాల నిర్వహణకు 10 వేల రూపాయలను గణేష్ కుటుంబ సభ్యులకు అందజేసి గణేష్ మృతదేహానికి నివాళులు అర్పించి  కుటుంబ సబ్యులకు ప్రగాడ సానుబూతి తెలిపారు. సంస్థ సభ్యులందరూ మనిషికి 200 రూపాయల చొప్పున అందజేసిన అమౌంట్ తో గణేష్ కుటుంబ సభ్యుల పేరు మీద డిపాజిట్ చేయనున్నట్లు సంస్థ సభ్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *