
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 21: నార్కెట్పల్లి మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యంగ్ ఇండియా కే బోల్ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు జిల్లా పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తిరుగుడు రవి యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవి యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేర్చే బాధ్యత ప్రతి యూత్ కాంగ్రెస్ కార్యకర్త విధిగా తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య యూత్ కాంగ్రెస్ నాయకులు వారధిగా నిలబడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాదాసు విజయ్, షరీఫ్, మేడి రమేష్, మేడబోయిన అభి, మేడి మనోజ్ కుమార్, శివశంకర్, సతీష్, రియాజ్, చల్లా ఉదయ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
