రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపికైన మహాత్మా విద్యార్థులు


స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 4, నార్కెట్పల్లి: పట్టణ కేంద్రంలోని మహాత్మ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి త్రో బాల్ పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ కె వాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల త్రో బాల్ రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో చిట్యాల లో నిర్వహించిన పోటీలలో పాఠశాల విద్యార్థులు కన్నెబోయిన వైష్ణవి, ఎడమ యశ్వంత్ లు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. పిల్లలు క్రీడలలో రాణించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తద్వారా పోటీ తత్వాన్ని జయించి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు సంతోష ఇతర ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *