
విద్యార్థులు ఏకగ్రత తో చదవాలని మోటివేషనల్ స్పీకర్ గూడూరు అంజిరెడ్డి విద్యార్థులకు సూచించారు. శనివారం లయన్స్ క్లబ్ నల్లగొండ ఆదర్శ మరియు ఇంపాక్ట్ ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో
యువ వికాసం కార్యక్రమం లో భాగంగా నార్కెట్ పల్లి మండలం లోని బ్రాహ్మణ వెల్లంల జిల్లాపరిషత్ హై స్కూల్, చిట్యాల మండలం పెద్ద కాపర్తి జిల్లాపరిషత్ హై స్కూల్ లలో లక్ష్య సాధన అంశం పై విద్యార్థులకు అవగాహనా కల్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కస్టపడి కాకుండా ఇష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు
అధ్యక్షులు లయన్ రమేష్ పెండ్యాల, పూర్వ అధ్యక్షులు లయన్ వెంకటేశ్వర్లు నాలం ,లయన్ మాజీ జోన్ చైర్ పర్సన్ లయన్ ప్రభాకర్ రావు సంధినేని, లయన్ విప్లవ కుమార్ నేతి తదితరులు పాల్గొన్నారు.

