ఓటరు నిర్భయంగా ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 25: ప్రతి ఒక్క ఓటరు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా స్వచ్ఛందంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అవుతుందని నార్కెట్పల్లి తహసిల్దార్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక తహసిల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు నార్కెట్పల్లి పోలీస్ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ప్రజలు కుల, మత, జాతి, వర్గం, భాష లాంటి ఒత్తిడిలకు లోను కాకుండా నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు. ఓటరు చైతన్యానికి ఎన్నికల సంఘం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు ఎన్నికల వ్యవస్థను గౌరవించి ప్రజాస్వామ్యానికి పట్టం కట్టాలంటే ప్రతి ఒక్కరు ఓటు వేసి తమ బాధ్యతను నెరవేర్చాలన్నారు. అనంతరం ఓటర్లతో ప్రతిజ్న చేపించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ వెంకటేశ్వర్లు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ తరుణ్, అసిస్టెంట్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ భవాని, సీనియర్ అసిస్టెంట్ యాదయ్య, జూనియర్ అసిస్టెంట్లు శంకర్, సువర్ణ, రజిత, జి పి ఓ లు ప్రదీప్, శ్రీను, స్వామి, వెంకట్, రెడ్డి కొండల్ రావు, ఉపేందర్, అటెండర్ లు పద్మ, జ్యోతి ఆపరేటర్లు శంకర్, శివ శంకర్, ఎల్లేష్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *