
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 26: గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు ప్రతి సంవత్సరం ఉత్తమ సేవా పురస్కారాలు అందజేస్తారు. అందులో భాగంగా రెవెన్యూ శాఖ తరఫున ప్రజలకు ఉత్తమ సేవలందించినందుకు గాను నార్కెట్పల్లి తాసిల్దారు వెంకటేశ్వరరావుకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ ల చేతుల మీదుగా సోమవారం నల్లగొండ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఉత్తమ సేవా పురస్కారం అందజేశారు.
