పార్వతి పరమేశ్వరులకు శేష వాహన సేవ

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 27: చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను మహా మండపం నుంచి శేష వాహనంపై కూర్చుండబెట్టి ఆలయ పురవీధుల నుంచి హోమం వద్దకు తీసుకువెళ్లి అర్చకులు వేదమంత్రోత్సవాలనుకుంటే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆహుతులను ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన
చెరువుగట్టు బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి గట్టు పైన కళ్యాణమండపం వద్ద నల్లగొండకు చెందిన నాట్య డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చిన్నారుల నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.

స్వామివారి అగ్నిగుండాల కార్యక్రమం విజయవంతం చేయాలి: ఈవో మోహన్ బాబు
పార్వతీ పరమేశ్వరుల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారుజామున నిర్వహించే అగ్నిగుండాల కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా విజ్ఞప్తి చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అగ్నిగుండం నుంచి వెళ్లే భక్తులు చాలా జాగ్రత్త వహించాలని పోలీసులు, దేవాలయ సిబ్బంది చెప్పినట్లు విని సహకరించాలని విన్నవించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *