స్వేచ్చ న్యూస్, హైదరాబాద్, ఆగస్ట్:

లీడ్ ఇండియా ఫౌండేషన్ సర్టిఫైడ్ ట్రైనర్ గా నార్కెట్ పల్లి కి చెందిన అంజిరెడ్డి గూడూరు ఎంపికయ్యారు. లీడ్ ఇండియా ఫౌండేషన్ లో ట్రైనింగ్ అఫ్ ట్రైనర్ మరియు టీచర్స్ ఆర్ ది ట్రాన్స్ ఫార్మర్స్ ఆఫ్ ఇండియా కోర్స్ లు పూర్తి చేసిన సందర్బంగా ఆదివారం హైదరాబాద్, చిక్కడపల్లి లోని త్యాగరాయ గాన సభ లో ఏర్పాటు చేసిన సనాతన స్నాతకోత్సవం కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ప్రొఫెసర్ సుదర్శన ఆచార్య సిర్టిఫికెట్ ను అందజేశారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి గూడూరు మాట్లాడుతూ లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆశయం మిషన్ 2047 విశ్వగురు గా భారత్ లక్ష్యం కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కొండల్ పులి, రాకేష్, సరళ, వీరవెల్లి శ్రీలత, సంధ్య, శృతి, విజయ్, మురళి తదితరులు పాల్గొన్నారు.

